నిజంనిప్పులాంటిది

Mar 19 2023, 09:59

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది

సుప్రీంకోర్టు (Supreme Court)లో ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సుప్రీంకు ఈడీ విజ్ఞప్తి చేసింది. ఈనెల 24న కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కేవియట్ పిటిషన్ దాఖలుతో కవిత తరపు వాదనలు, ఈడీ తరపు వాదనలు సుప్రీంకోర్టు విననుంది.

ఈడీ (ED) తనను విచారణకు పిలవడాన్ని సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా... 24న విచారిస్తామని కోర్టు తెలిపిన విషయం తెలిసిందే. మార్చి 16న ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. దీంతో ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించింది. అయితే కవిత పిటిషన్‌ను తాము ముందు చెప్పిన విధంగా 24నే విచారిస్తామని.. దాంట్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ (Petition) విచారణ జరిగేంత వరకూ ఆగాలని కవిత చేసిన అభ్యర్థనను ఈడీ తోసిపుచ్చింది. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ ఏకంగా లేఖాస్త్రాన్ని సంధించారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ తాజా సమన్లలో ఎక్కడా పేర్కొనలేదని అందులో ప్రస్తావించారు. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లానని గుర్తు చేశారు. దర్యాప్తు న్యాయపరంగా, చట్టప్రకారం జరగడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు ఈ నెల 24 ఈ నెల 24న తన కేసు విచారణకు స్వీకరించే దాకా వేచి చూడాలని, ఏమైనా సమాచారం కావాలంటే తన అధికారిక ప్రతినిధికి చెప్పాలని, లేకపోతే తనకు ఈ-మెయిల్‌ చేయవచ్చని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు.

సాధ్యమైనంత వరకు ఈడీ దర్యాప్తు తప్పించుకోవాలని కవిత ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులైన అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ఆడిటర్‌ బుచ్చిబాబులను ముఖాముఖి కూర్చోబెట్టి ఒకరు చెప్పిన సాక్ష్యాలను మరొకరితో ధ్రువీకరింపచేయాలని, అనంతరం అరుణ్‌ పిళ్లైని కవితతో ముఖాముఖి కూర్చోబెట్టి వాస్తవాలను అంగీకరింపచేయాలని ఈడీ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.

నిజంనిప్పులాంటిది

Mar 18 2023, 11:51

TSPSC: టీఎస్‎పీఎస్సీ బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం?

హైదరాబాద్: TSPSC బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పేపర్ లీకేజ్‌పై(Paper leakage) ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) సీరియస్‎గా ఉన్నట్లు తెలుస్తోంది.

TSPSC చైర్మన్ జనార్ధన్‌రెడ్డిని(Janardhan Reddy) ప్రగతిభవన్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన హుటాహుటిన ప్రగతి భవన్ చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ (kcr) మంత్రులు హరీష్‌రావు(Harish Rao), కేటీఆర్ (KTR)తో భేటీ అయ్యే అవకాశం ఉంది..

కాగా, గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దయింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‎పీఎస్సీ)TSPSC ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1తోపాటు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

శుక్రవారం TSPSC (టీఎస్‎పీఎస్సీ) అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో తాజా నిర్ణయంతో మొత్తం ఆరు పరీక్షలను రద్దు చేసినట్లయింది.

నిజంనిప్పులాంటిది

Mar 18 2023, 08:33

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. వాతావరణ శాఖ సూచన

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని తెలిపింది..

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్‌ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

దీంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది..

నిజంనిప్పులాంటిది

Mar 18 2023, 08:31

Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. రెండు డీసీఎంలు దగ్ధం..

హైదరాబాద్‌: నగరంలో మరో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రిపురంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. రెండు డీసీఎంలతో పాటు గోదాంలో విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది..

నిజంనిప్పులాంటిది

Mar 17 2023, 18:13

పెద్దకాపర్తి లో ఆయుస్మాన్ భారత్ ఈ కేవైసి.

 చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో 77 వ బూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆయుస్మాన్ భారత్ ఈ కేవైసి కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు శేపురి రవీందర్ గారి సహకారంతో 77వ బూత్ అధ్యక్షులు తెలుసూరి నర్సింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వ మరియు ప్రవేట్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందించాలనే ఉద్దేశ్యంతో ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్దిదారులకు అందించనున్నారని వారు తెలిపారు.

ఈనెల 31 వరకు గ్రామంలో బీజేపీ ఆద్వర్యంలో ఉచితంగా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు మోర దనుంజయ్య ,సీనియర్ నాయకులు పోట్లపల్లి సుభాష్ గౌడ్ ,  మైల సత్తయ్య , గుండెబోయిన నర్సింహ , మోర నరేష్ , కాటం సందీప్, హరీష్ , మహేష్ , లింగస్వామి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 17 2023, 16:05

స్వప్నలోక్‌ అగ్ని ప్రమాద మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని.. అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు మహమూద్‌ అలీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు సూచించారు.

మరణించినవారికి ₹5 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

ఏం జరిగిందంటే..

సికింద్రాబాద్‌లోని రద్దీ ప్రాంతంలో ఉన్న స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి వేళ 7, 8 అంతస్థుల్లో తొలుత మంటలు చెలరేగాయి.

నిజంనిప్పులాంటిది

Mar 17 2023, 15:48

విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ పై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి.

సూర్యాపేట జిల్లా చివ్వేంల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతికి కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్ ని తక్షణమే విధుల నుంచి తొలగించి చట్టపరంగా హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ విద్యార్థి మృతికి ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమన్నారు. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రిన్సిపల్ అలసత్వం వహించడం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు. ప్రమాదం జరిగినప్పుడే అధికారులు, ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు చేపట్టడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

గాయపడిన విద్యార్థులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని, మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, సూర్యాపేట జిల్లా కేంద్రంలో 500 గజాల ఇంటిస్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్, సాయి, శ్రీకాంత్, సంపత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 17 2023, 15:46

ఐ.ఎఫ్.టి.యు నల్లగొండ జిల్లా 5వ మహాసభను జయప్రదం చేయాలని కరపత్రం ఆవిష్కరణ...IFTU

భారత కార్మిక సంఘాల సమాఖ్య( ఐ ఎఫ్ టి యు) నల్లగొండ జిల్లా 5వ మహాసభను ఈనెల 21న నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ లో నిర్వహిస్తున్నట్లు దీనికి పెద్ద ఎత్తున కార్మికులు హాజరుకావాలని ఐఎఫ్ టీయు నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్ కోరారు.

జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ లో ఐ ఎఫ్ టి యు నల్లగొండ జిల్లా 5వ మహాసభను జయప్రదం చేయాలంటూ కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా IFTU జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్,జిల్లా నాయకులు బొంగరాల నర్సింహాలు పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను నిరాకరిస్తూ, కార్పోరేట్ కంపెనీల యాజమాన్యాలకు కార్మిక చట్టాలను తాకట్టుపెట్టి పాద సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు.

ఏకకాలంలో ఆదాని ఆస్తులు ఎలా పెరిగినాయని దీనికి మోడీ ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. సామాన్యులను పట్టించుకోని ప్రభుత్వం కార్పొరేట్లకు 12:30 లక్షల కోట్లకు పైగా రుణాలు మాఫీ చేశారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ,గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలను పెంచుతూ పేద ప్రజలపై భారలు మోపుతున్నారని దుయ్యబట్టారు. కార్మికుల కనీస వేతనాలు దిగజారిపోతున్నాయని, కొనుగోలు శక్తి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని దీనికి మోడీ ప్రభుత్వమే కారణమని తెలియజేశారు.

IFTU నల్లగొండ జిల్లాలో వివిధ రంగాల కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని, ఆ పోరాట వెలుగులో అనేక విజయాలు కూడా సాధించిందని, గత ఉద్యమాలను సమీక్షించుకొని, భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడానికి IFTU నల్లగొండ జిల్లా 5వ మహాసభను నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ లో ఈ నెల 21న నిర్వహించనున్నట్లు దీనికి పెద్ద ఎత్తున కార్మికుల హాజరు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో IFTU నాయకులు కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహా,జానపాటి శంకర్,మామిడాల ప్రవీణ్,తాలూక వెంకన్న,సింగం మహేష్,బొమ్మపాల అశోక్,తీగల నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 17 2023, 11:51

Atchannaidu: 'సీఎంకు కర్రకాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు'

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmoha Reddy) కి కర్రకాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) అన్నారు..

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల తిరగబడితే ఫలితం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి (AP CM) కి ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్యo సిగ్గుపడేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగినా ప్రజలు తమ పక్షానే నిలిచారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని భావించి మూడు రాజధానులంటూ మోసాగించే యత్నం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోతే మూడు రాజధానులకు ప్రజలు వ్యతిరేకంగా అనే భావన వ్యక్తమవుతుందని వైసీపీ నేతలే ప్రచారం చేశారన్నారు..

అభివృద్దే తమ నినాదం అని ఉత్తరాంధ్ర ప్రజలు చాటి చెప్పారని అన్నారు. విశాఖలో రూ.40 వేల కోట్ల భూములను వైసీపీ కొల్లగొట్టిందని తాము చూపిన ఆధారాలు ప్రజలు నమ్మి ఓటు వేశారని తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అసంతృప్తి లో ఉన్న చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల (YCP MLAs) కు తాజా పట్టభద్రుల ఫలితాలు చూసి అంతరాత్మప్రభోదానుసారం ఓటేయబోతున్నారని చెప్పారు. రేపు జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పట్టభద్రుల ఎన్నికలు సెమీఫైనల్‌గా భావిస్తున్నామన్నారు. రేపు పులివెందుల కూడా గెలవబోతున్నామని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు..

నిజంనిప్పులాంటిది

Mar 17 2023, 11:47

అరెస్ట్ చేయవద్దని చెప్పలేం: వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు..

హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై సీబీఐ తవ్ర చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకానందరెడ్డి..

ఈ పిటిషన్ ను హైకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. వైఎస్ అవినాష్ రెడ్డి మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.

అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అవినాష్ రెడ్డిని విచారించే ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

అవినాష్ రెడ్డి తదుపరి విచారణపై స్టే కూడా ఇవ్వలేమనిహైకోర్టు తేల్చి చెప్పింది..